ప్రశంసాపత్రం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
నేను వ్రాసిన కవితను
నచ్చిమెచ్చి
నాకిచ్చిన యోగ్యతా పత్రం

ఫీల్డ్
@@@
అదో అపురూప జ్ఞాపకం
నేను చూసుకున్న
ప్రతిసారి
నేను పురుడు పోసిన
కవితా శిశువుకు 
ముస్తాబు చేసినట్టు అనిపించే
అదో స్వీయానుభూతి
================

శాలువా
@@@
నా కవితా గానం
విని ఆనందించి
వేనోళ్ళ పొగిడి
నా భుజాలమీద
సాహితీ సరస్వతి చేయ్యేసి కప్పిన ఓ ఆత్మీయపుకరస్పర్శ
 అదో దివ్యానుభూతి 
అది అనుభవేకవేద్యం

కామెంట్‌లు