స్వాతంత్య్ర స్ఫూర్తి -వజ్రోత్సవదీప్తి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497

 సడలని ఉక్కు సంకల్పం
దేశానికి స్వాతంత్య్రమే
ఏకైక లక్ష్యం
పరాయి పాలన అంతం
స్వేచ్ఛా వాయువులు మనసొంతం
రక్తం చిందించక రణమును నడిపి
అతివాద ,మితవాదులందరిని
ఒకే తాటి పైకి తెచ్చి
స్వాతంత్ర్య దీక్ష పట్టించి
స్వరాజ్య కాంక్ష రగిల్చిన
మూడు కాళ్ళ ముదుసలి
సంకల్పబలం
న్యాయమైన డిమాండ్ కై
అలుపెరుగని పోరాటం
వందేమాతరం అని నినదించినా
విదేశీ వస్త్రబహిష్కరణైనా
శాసనోల్లంఘణమైనా
దండి ఉప్పు సత్యాగ్రహమైనా
పోరాట తంత్రమును పలు రూపాల్లో ముందుకు తీసుకెళ్ళి
గమ్యం చేర్చిన ఘనాపాటి
మన జాతిపిత మహాత్మా గాంధీ
ఎందరో అమరుల త్యాగం
కవులు కళాకారుల మాట పాట
ఈ ధీయుక్తులు
పల్లెపల్లెను ఏకం చేసి
 గాంధీ యిజాన్ని
స్వాతంత్ర్య కాంక్షను పాటగా నాటకంగా బుర్రకథగా గానం చేసి
సామాన్యులను సైతం సమరోన్ముఖులను చేసి
తెల్లదొరల తుపాకీ తూటాలకు బలియైన
అమరుల త్యాగాలతోనే
మనకు దక్కింది గదా
ఈ స్వరాజ్యం
నాటి స్ఫూర్తి నేటి తరాన పాదుకొల్పాలి
వ్యక్తి స్వార్థం అనే మహమ్మారిని తరిమి తరిమి కొడదాం
దేశ పౌరుల సమిష్టి ప్రయోజనానికై కృషి చేద్దాం
జైబోలో స్వాతంత్ర్య
భారత్ కీ జై
కామెంట్‌లు