జాగ్రత్తగా ఉండమ్మా!;- -గద్వాల సోమన్న,9966414580
దుర్వినీతి లోకంలో
దుశ్శాసన పర్వంలో
జాగ్రత్తగా ఉండమ్మా!
కీచకుల సమాజంలో

కామాంధుల కళ్ళకు
నికృష్టుల చేష్టలకు
దూరంగా ఉండమ్మా!
మేక వన్నె పులులకు

ఎందరో అక్కవాళ్ళు
చిరు నవ్వుల చెల్లెళ్లు
కామాంధుల చేతుల్లో
విగత జీవులయ్యారు

అనాదిగా ఆడవాళ్ళు
బలి పశువులవుతున్నారు
మరెందరో రావణులు
పెట్రేగి పోతున్నారు

ప్రతి చోట మాయగాళ్ళు 
కోకొల్లలుగా ఉన్నారు!
పెద్దోళ్ల అండతోన
బయట తిరుగుతున్నారు!

అందరినీ నమ్మేయకు
అమాయకంగా ఉండకు
కసాయి వాణ్ణి నమ్మిన
గొర్రెలాగ పోబోకు


కామెంట్‌లు