చిట్టి చిట్టి కమలాలు;- -గద్వాల సోమన్న,9966414580
చెరువులోని కమలాలు
దోచునోయి నయనాలు
విచ్చుకున్న చాలునోయి
నచ్చుతాయి కమలాలు

ఉన్నచోట అందాలు
తెచ్చునోయి కమలాలు
హంసలతో స్నేహాలు
కొలనులతో బంధాలు

తెల్లని గౌను వేసుకుని
మెల్లగా నవ్వుతున్న
నీటి పాన్పు చేసుకుని
పండుకున్న కమలాలు

చిట్టి చిట్టి కమలాలు
సొగసులీను కమలాలు
ఆకట్టుకొను మెండుగా
చూచు వారి  హృదయాలు


కామెంట్‌లు