పిడుగులాంటి పిల్లవాడు;- -గద్వాల సోమన్న,9966414580
చక్కనైన పిల్లవాడు
చందమామ వంటివాడు
అల్లరెంతో చేస్తాడు
అందరికీ ఇష్టుడతడు

కిలకిలమని నవ్వుతాడు
అందాలే రువ్వుతాడు
కథలెన్నో చెప్పమని
ఒడిలోన కూర్చుంటాడు

శ్రద్ధగా ఆలకిస్తాడు
కునికిపాట్లు పడతాడు
మెల్లగా నిద్రలోకి
అతడు జారుకుంటాడు

బలే బలే పిల్లవాడు
చురుకైన పిల్లవాడు
ప్రశ్నలెన్నో వేస్తాడు
జవాబు అడుగుతాడు

పిడుగులాంటి పిల్లవాడు
అడుగు ముందుకెస్తాడు
అనుకున్నది సాధించి
అవుతాడు భగీరథుడు


కామెంట్‌లు