గురజాడ తెలుగు వెలుగు మేడ;- -గద్వాల సోమన్న,9966414580

 అక్షరాల ఆకసాన

వెలుగుతున్న తెలుగు రవి

గురజాడ అప్పారావు

గారు మహిని మహా కవి


వర్ధమాన కవులకతడు

చూపించెను వెలుగు జాడ

తెలుగు భాష ప్రేమికులకు

విజ్ఞానపు తరువు నీడ


వ్యావహారిక భాషలో

వ్రాసి చూపె తెలుగు చవి

నిత్యమూ ఉబుకుచుండు

సాహిత్యాన ఊట బావి


గురజాడ అప్పారావు

తెలుగోళ్లకు బహుమానము

వాడుక పదాల ఎన్నికలో

వారి ప్రతిభ అసమానము



తేట తెలుగు వెలుగు జిలుగు

పద బంధాల పూదోట

చక్కని నుడికారాలు

మలచుటలో  పెట్టనికోట


కామెంట్‌లు