చిన్న పిల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
పిల్లలుంటే గృహమున
ఆనందమే మనసున
పవిత్రమైన హృదయులు
ఇలవేల్పులే ఇహమున

బాలలే గగనంలో
భానులే సదనంలో
పువ్వుల్లాంటి పిల్లలు
నవ్వులే వదనంలో

ఆడే పాడే పిల్లలు
వికసించిన మరు మల్లెలు
వారున్న కుటుంబాన
దీవెనలు  కోకొల్లలు

ప్రేమతో  పెంచాలి
అనురాగం పంచాలి
విజ్ఞానవంతులుగా
చిన్నారులను చేయాలి


కామెంట్‌లు