చిట్టి చిట్టి కమలాలు;- -గద్వాల సోమన్న,9966414580
చిట్టి చిట్టి కమలాలు
చిత్రమైన  కమలాలు
బురదలోన పుట్టినా
స్వచ్ఛమైన కమలాలు

కొలనులోని కమలాలు
కనులకింపు కమలాలు
పగటిపూట వికసించు
రమ్యమైన కమలాలు

ఆదర్శం కమలాలు
అద్భుతమే కమలాలు
సూర్యకాంతి సోకగా
సొగసులీను కమలాలు

ముద్దు ముద్దు కమలాలు
ముచ్చటైన కమలాలు
పసి పిల్లల రీతిలో
మురిపించే కమలాలు

నీటిలోని కమలాలు
సాటిలేని కమలాలు
మేటియైన కమలాలు
సృష్టిలోన కమలాలు


కామెంట్‌లు