సాటిలేని మేటి అమ్మ;- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ జోలపాటలో
ఆమె ప్రేమ తోటలో
ఎంత హాయి దాగుందో!
మధురమైన మాటలో

శుద్ధమైన మనసులో
హద్దులేని త్యాగంలో
తల్లికెవరు సమానము!
ఆమె చేయు సేవలో

అమ్మ ఉంటే స్వర్గము
వర్ధిల్లును కుటుంబము
ఆమె లేక యమలోకము
అడుగడుగునా శోకము

అమ్మకివ్వు గౌరవము
గుండె గుడిలో స్థానము
అవసాన దశలోనూ
కనురెప్పలా కాయుము


కామెంట్‌లు