"మంచి మిత్రుడు పుస్తకం";- -గద్వాల సోమన్న,9966414580
విలువైనది పుస్తకము
జీవితాన నేస్తము
చదివితే దినదినము
తరుగును అజ్ఞానము

విడువక సహవాసము
చేస్తేనే లాభము
అంతులేని జ్ఞానము
అవుతుందిక సొంతము

నమ్మకమైన మిత్రుడు
విశ్వాస పాత్రుడు
పుస్తకమే బ్రతుకున
సంతోషమే మనసున

నేస్తంలా వచ్చును
వెన్ను తట్టి నిలుచును
ఒంటరితనం పోగొట్టి
ఆహ్లాదము పంచును

బలే బలే పుస్తకము
వెలిగించును మస్తకము
కావాలి అనుదినము
సదా హస్త భూషణము

పఠించుము ప్రతిదినము
శ్రేష్టమైన పుస్తకము
పెరుగునోయ్!వికాసము
పొంగిపొర్లు వినోదము


కామెంట్‌లు