విహరించే పక్షులు;- -గద్వాల సోమన్న,9966414580
నింగిలో  స్వేచ్ఛగా
విహరించే పక్షులు
చింతలను వీడగా
సంతసించు ప్రాణులు

సమైక్యత చాటగా
సాగునోయ్! గుంపుగా
కలసిమెలసి ఉండును
ఖగములే చూడగా

రెక్కల సాయంగా
పయనించు ముద్దుగా
పక్షుల విహారమే!
చూడు మనోహరమే!

ఉండాలి అండగా
కనీస బాధ్యతగా
పక్కిలను ప్రేమగా
చూడాలి గొప్పగా


కామెంట్‌లు