పరోపకారముంది!!;- -గద్వాల సోమన్న,9966414580
విరిసే పూలలోన
కురిసే వానలోన
పరోపకారముంది
మెరిసే మెరుపులోన

ప్రాకే తీగల్లో
పారే  యేరుల్లో
పరోపకారముంది
పాడే గొంతుల్లో

మండే సూర్యునిలో
పండే  చేనుల్లో
పరోపకారముంది
ఉండే గృహముల్లో

చేసే చేతల్లో
వ్రాసే రాతల్లో
పరోపకారముంది
వేసే అడుగుల్లో

మెచ్చే మనసుల్లో
నచ్చే మనుషుల్లో
పరోపకారముంది
ఇచ్చే చేతుల్లో


కామెంట్‌లు