తాతయ్య సూక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
శ్రద్ధగా చదవండీ!
బుద్ధులు దిద్దుకోండీ
పెద్దల మాటలు గైకొని
వృద్ధిలోకి రారండీ!

బద్ధకమే వీడండీ!
అద్దంలా బ్రతకండీ!
ఉద్ధరించు మాటలతో
ఉద్దీపన పొందండీ!

వృద్ధుల సేవ చేయండీ!
హద్దుల్లో ఉండండీ!
ముద్దులొలుకు పిల్లలూ!
ముద్దులెన్నొ ఇవ్వండీ!

మొద్దులా ఉండకండీ!
ఎద్దులా పని చేయండీ!
వద్దు వద్దు పిరికితనం
ముద్దు ముద్దు చురుకుదనం


కామెంట్‌లు