అసూయ పెనుభూతము;- -గద్వాల సోమన్న,9966414580
నిప్పు కణిక అసూయ
చూడుము దాని మాయ
హరిస్తుంది నెమ్మది
గమనిస్తే చెడ్డది

చెరుపును జీవితాలు
కూల్చును కుటుంబాలు
అపాయమే అసూయ
చేయును పలు ముక్కలు

దాని వలలో పడకు
విషాద గీతి కడకు
అసూయ పెనుభూతము
వద్దోయ్! దాని వశము

అసూయ చీడపురుగు
తినివేయును బ్రతుకులు
నొప్పించును మనసులు
తెప్పించును ఇడుములు


కామెంట్‌లు