చైత్రపురి రాజ్యాన్ని జయేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. రాజ్యంలోని ప్రజల బాగు కోసం అహర్నిశలు శ్రమించేవాడు. రాజ్యంలో ఒక యేడు బాగా కరువు సంభవించింది. జయేంద్రవర్మ బాగా ఆలోచించి, తన రాజమందిరంలో ఉన్న ధాన్యాన్ని, ధనమును ప్రతి గ్రామకూడలి వద్దకు పంపాడు.
మహారాజు జయేంద్రవర్మ దయాగుణానికి సంతోషించారు. కానీ కూడలి వద్ద నుంచి ఆ ధాన్యము, ధనము ఎవరి ఇంటికి తీసుకువెళ్లినా సరిపోదు, ఏమి చేయాలో ప్రజలకు అర్థం కాలేదు, బాగా ఆలోచించారు. మహారాజు జయేంద్రవర్మ ఆలోచనలకు బీజం వేస్తూ, తమ ఇంట్లో కూడా ఉన్న కొద్దిపాటి ధాన్యం, ధనమును కూడా కూడలి వద్ద ఉంచారు. అందరూ కలిసి అవసరం మేరకు పొదుపుగా ఉంటూ, గ్రామ కూడలి వద్దనే వంట చేసుకుని, సహపంక్తి భోజనం చేసి జీవిస్తూ, కలిసిమెలిసి ఉండసాగారు. దేవుడు కరుణించి వర్షాలు కురియగానే, పంఢో, ఫలమో తింటూ జీవిస్తూ కరువు కాలం నుంచి బయటపడ్డారు. ఆపదలో ఆదుకున్న మహారాజు జయేంద్రవర్మ
కు తిరిగి ధాన్యం, ధనం చెల్లించారు. అలాగే అందరూ కలిసిమెలిసి ఉంటూ గ్రామకూడలి వద్దనే సహపంక్తి భోజనం చేస్తూ సంతోషంగా ఉండసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి