ధర్మాచరణ( ధర్మం శరణం గచ్చామి )- (సి.హెచ్.ప్రతాప్
 ధర్మాచరణ గురించి రామాయణం లో వాల్మీకి రెండు గుణాలు చెప్పారు.
ఒకటి: “ధృతి” రెండు: “నియమం”. రామాయణంలో శ్రీరాముడు అడవులకి వెళ్ళే ముందు తల్లి కౌసల్యకి నమస్కరించాడు.ఆమె “ధర్మ మార్గం లో నడువు” – అని ఉపదేశించలేదు.
రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. “ధర్మంచర” అని ఆయనకొకరు చెప్పబని లేదని తల్లికి తెలుసు.అందుకని ఆమె ఇలా ఆశీర్వదించింది. “నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో, ఆ ధర్మమే నిన్ను రక్షించు గాక!” ధర్మాచరణకు సంబంధించి మన ఆధ్యాత్మిక వేత్తలు ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. పాపం చేసేటపుడు ఎవరికైనా సుఖ భ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించే రోజున జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతబట్టడం.దానిని ఇతరులపై విసిరే లోపల ఆ నిప్పు నిన్ను దహించివేస్తుంది.బుద్ధి విచక్షణతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మ మార్గంలో ఈ సమాజంతో కలిసి నడవాలి. దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు.స్వీయ నియంత్రణ కలిగి ఉండటమే బలం. సరియైన ఆలోచనలు చేయటమే పాండిత్యం. ప్రశాంతంగా ఉండటమే శక్తి అసలు రూపం.ధృ" అనే ధాతువు నుండి “ధర్మం” అనే పదం పుట్టింది. “ధృ” అంటే ధరించడం అని అర్థం. దానంతట అది సహజంగా ధరింపబడిందే ధర్మం. అంటే అది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని మతాలకు కూడ సహజంగా ఉంటుంది. ఒక మతం వారు గాని ఒక దేశం వారు గాని ఏర్పరచింది కాదు.ఒక వానపాము, కీటకం, పక్షి లేదా ఒక మొక్క, ఏదైనా సరే, అన్నిటికీకూడా ఈ ఉనికికి వర్తించే ప్రాథమికనియమాలే వర్తిస్తాయి,అదే సనాతన ధర్మం. మనిషిపై మనిషి నియంత్రణ కోసమో, సమానత్వం కోసమో సంఘంలో పెట్టుకున్న శిక్షాస్మృతులు కావు.భారతీయుడైనా, హిందువైనా కాకున్నా సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది. 

కామెంట్‌లు