తురతురియా! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఛత్తీస్గఢ్ లోని తురతురియా అనే ప్రాంతంలోనే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని యోగులు తేల్చి చెప్పారు.ఆప్రాంతంలోనే అత్రి శృంగి కూడా నివసించేవారు అని కౌసల్య పుట్టిన గడ్డ అని నమ్మకం.రాయ్పూర్ జిల్లా లో ఉంది తురతురియా.అక్కడున్న ఆదివాసీలు బాల్మదీ నాలానుగంగతో సమానంగా భావించి పూజిస్తారు.దీన్ని సుర్ సరి గంగ అని కూడా పిలుస్తారు.సీతామాత వాల్మీకి ఆశ్రమంలో ఉండి లవకుశులకు జన్మనిచ్చింది తురతురియా లోనే  అని చరిత్ర కారులు భావిస్తున్నారు.దూధాధారీ అనే యోగి అక్కడి కొండ గుహలో తపస్సు చేశాడు.రాజస్థాన్ వాసులకు ఇది పరమపవిత్రమైన ప్రదేశం.
అసలు వాల్మీకి ఎవరు? విష్ణు పురాణం ప్రకారం ఆయన అసలుపేరు ఋక్ష.భృగివంశంవాడు. తపస్సు తో ఆయన శరీరం పై పుట్ట పెరిగి వాల్మీకి అని పిల్వబడ్డాడు.సీతారామలక్ష్మణులు ఛత్తీస్గఢ్ లోనే ఎక్కువ కాలం నివసించారు.ఆప్రాంతంవారు రాముడిని భాంజా మేనల్లుడు గా ఇప్పటికీ భావిస్తున్నారు.ఛత్తీస్గఢ్ లో మామా భాంజా ఆలయాలు చెరువులున్నాయి.అత్రిముని కూతురు ఆత్రేయిని వాల్మీకి ఆశ్రమంకి  చదువు కోటంకోసం వచ్చిపోతుండేది.లవకుశులు వాల్మీకి మహర్షి తో ఉన్నట్లు ఆయన వద్ద విద్యాభ్యాసం చేస్తున్నట్లుగా  అక్కడి శిల్పాలు ప్రత్యక్ష సాక్షులు గా ఉన్నాయి. 🌹
కామెంట్‌లు