శాక్యనయనార్! అచ్యుతుని రాజ్యశ్రీ

 బంతి పూలు సువాసనతో వైరస్ నుంచి కాపాడుతాయి.వాటి కాడతుంచినా వాసన ఘుమాయిస్తుంది.అలాంటిదే నాయనార్లజీవితాలు.కంచిలో ఊరిచివర ఓ పెద్ద శివలింగం ఉండేది. ఆరోజుల్లో హిందూదైవారాధనకు కఠిన శిక్షలు కావడంతో శాక్యనయనార్ ద్విపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివ స్మరణచేస్తే దైహికశిక్షలు తప్పవు.అలా అని తనభక్తిని శివలింగం పై చూపకుండా ఉండలేడు.అందుకే రోజు ఓ చిన్న రాయితీసుకుని లింగంపై విసురుతూ లోపల ఏడుస్తూ " తండ్రీ! ఇదిగో బంతి పూలు వేస్తున్నా.మారేడుదళం అర్పిస్తున్నా" అంటూ మనసులో బాధ మధన పడుతూ ఇంట్లో అన్నంతినేముందు" మహేశ్వరా!  పరమేశా!నేను విసిరింది రాయికాదు.మనసనే భక్తి పూజాపుష్పాలు"అనేవాడు.అలా రోజు లింగం దగ్గరకు వెళ్లి "నీవు శివుడివా!  గుండ్రాయివి" అని తిడుతూ రాయివిసిరేవాడు లింగంపై.శివుడు ఆయన భక్తికి మెచ్చి నటరాజ మూర్తి గా సాక్షాత్కరించి తనలో లీనం చేసుకున్నాడు. అన్నం పొట్టలో జీర్ణమైనట్లు దైవభక్తి  సదా భగవస్మరణ తో మనం తరిస్తాం🌷
కామెంట్‌లు