న్యాయాలు -612
బధిర జాప/ జప న్యాయము
*****
బధిర అనగా చెవిటితనం కలిగిన వ్యక్తి. జాప అనగా జపము,గొణుగుడు , గుసగుసలు,గొణుక్కునే మాటలు, వేదాధ్యయనము, ప్రార్థన,మంద స్వరంతో ఉచ్ఛరించుట,దేవతల నామమును పలుమార్లు ఉచ్ఛరించుట, తక్కువ స్వరంతో పలకడం, అంతర్గతంగా పునరావృతం చేయడం అనే అర్థాలు ఉన్నాయి.
"చెవిటి వ్యక్తి చెవిలో రహస్యం చెప్పినట్లు"
ఏదైనా విషయం ఎవరికీ చెప్పకూడదు భావించి నప్పుడు, దానిని కేవలం ప్రాణ స్నేహితులతోనే పంచుకోవాలంటే ఎవరికీ వినపడకుండా గుసగుసగా చెప్పుకుంటాం.
ఇక కొందరు వ్యక్తులు తమకు నచ్చని ఇతరుల గురించి విమర్శించాలనుకుంటే ముఖతా కాకుండా వారి వెనకాల చేరి గుసగుసగా చెప్పుకోవడం చూస్తుంటాం.ఇదంతా బాగానే ఉంది. కానీ చెప్పే విషయం వినడానికి వినే వ్యక్తి యొక్క వినికిడి శక్తి బాగుంటే అసలు సమస్యే లేదు.ఒకవేళ వినే వ్యక్తి బధిరుడు అయితే... ఇక ఉంటుంది చెప్పేవాడికి తిప్పలు. ఏం చేయాలో తోచదు. చెప్పేది వినీ వినబడక ఇంకో విధంగా అర్థం చేసుకోవడం.. దానికి చిలువలు పలువలుగా ఊహించుకోవడం ఉంటాయి.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఈ న్యాయమునకు సంబంధించిన కొన్ని సామెతలను చెప్పుకుందాం.
"అతి రహస్యం చెవిలో పోటు", అతి రహస్యం బట్టబయలు, చెవిటి వ్యక్తి పంచాయతీ లాంటి సామెతలను మన పెద్దలు తరచుగా ఉపయోగిస్తుంటారు.
"అతి రహస్యం చెవిలో పోటు" అంటే ఏదైనా రహస్యాన్ని ప్రాణ విత్రుడని చెప్పుకోవాలనుకున్నప్ఫుడు,దానిని వినే మిత్రుడికి వినికిడి శక్తి తక్కువగా ఉన్నట్లయితే, ఇక ఆ రహస్యాన్ని దాయడం ఎంత కష్టమైన పనో వేరే చెప్పక్కర్లేదు.అంతటి రహస్యాన్ని గుసగుసగా చెబితేనేమో అర్థం కాదు. ఇక గట్టిగా చెవి దగ్గర చేరి చెబితేనేమో చెవి నొప్పి పుడుతుంది.అంతే కాదు బట్టబయలై అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఆ సామెత పుట్టుకొచ్చింది.
ఇలాంటిదే "చెవిటి వ్యక్తి పంచాయతీ". పంచాయతీ పెట్టుకున్న వ్యక్తులు అతడి దగ్గరకు తీర్పుకు వెళితే వినీ వినబడక ఎవరికీ న్యాయము జరిగే అవకాశం ఉండదు.అలాంటి వ్యక్తిని అడగడమే పొరపాటు.పైపెచ్చు సరిగా న్యాయము జరగలేదని బాధ పడటం అవివేకం అవుతుంది.
ఇలా "బధిర జాప/జప న్యాయము "లో ఆయా ఇబ్బంది ఉన్న వ్యక్తుల వినికిడి లోపం కారణంగా పై విధంగా జరుగుతుంది అని చెప్పడమే.అంతే గానీ అలాంటి వారిని విమర్శించడమో,మనసు నొప్పించడమో కాదు.అలాంటి వారి వల్ల ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి.
అయితే నేడు అత్యాధునిక పరికరాలు వచ్చాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడినట్లయితే ఆ యిబ్బంది నుంచి బయట పడవచ్చు. పుట్టుకతోనే వస్తే ఇక చేసేదేమీ లేదు. ఎప్పుడూ అప్రమత్తంగా గమనించేలా చేస్తూ తనను అలాంటి యిబ్బంది నుండి కొంత మేరకు బయట పడేలా చేయవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి