విజయకుమార్ సేవలు ఆదర్శనీయం



 మూడున్నర దశాబ్దాలపాటు అకుంఠిత దీక్షతో ఎందరో విద్యార్థులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన కోమటిపల్లి విజయకుమార్ అందరికీ ఆదర్శప్రాయుడని శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ అన్నారు. స్థానిక బి.సి.కోలనీలో ఎల్.ఎఫ్.ఎల్.హెచ్.ఎమ్. గా పనిచేస్తూ, ఇటీవల పదవీవిరమణ గావించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కోమటిపల్లి విజయకుమార్ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ఆర్సీఎం కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ సభకు
సభాధ్యక్షులు, సభఉపాధ్యక్షులుగా 
మండల విద్యాశాఖాధికారులు డి.గౌరునాయుడు, ఎం.ఆనందరావులు వ్యవహరించగా, సభా నిర్వహణా బాధ్యతలను పిఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు కె.టి.టి.వి. పోలినాయుడు చేపట్టి విజయకుమార్ దీక్ష పట్టుదలతో కూడిన సేవలను కొనియాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.
విశిష్ట అతిథిగా పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, గౌరవ అతిథిగా మాజీ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులునాయుడు సభాకిరణాలుగా విచ్చేసి, పాఠశాల విద్యా శాఖ పథకాలన్నీ మిక్కిలి చిత్తశుద్ధితో విజయకుమార్, వారి ధర్మపత్ని అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీ లూర్ధమ్మలు అమలు చేసీ సత్ఫలితాలను అందించారని ప్రశంసించారు. ప్రత్యేక అతిథులుగా సీతంపేట మండల విద్యాశాఖాధికారి దిబ్బ సూర్య చంద్రరావు, విశ్రాంత మండల విద్యాశాఖాధికారులు దన్నాన ప్రకాశరావు, ఉప్పాడ అప్పారావులు వేదికనలంకరించి విజయకుమార్ తోను, వారి తండ్రి ప్రకాశరావు మాస్టారి తో గల పెద్దరికాన్ని, వారి సోదరసోదరీమణులు ప్రతాప్ కుమార్, కిరణ్ కుమార్, రవికుమార్, నిర్మలతో తమకున్న సోదర అనుబంధాన్ని, వారివారి సామాజిక స్పృహను ప్రస్తావిస్తూ కొనియాడారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎం.పి.పి. దమలపాటి వెంకటరమణ నాయుడు, వైస్ ఎంపిపి పర్రి విజయకుమారి, స్థానిక ఆర్.సి.ఎం.పాఠశాలల కోఆర్డినేటర్ రాజు, పి.ఆర్.టి.యు. రాష్ట్ర పూర్వ అధ్యక్షులు భైరి అప్పారావు, జిల్లా పూర్వ అధ్యక్షులు వి.హరిశ్చంద్రుడు,  పార్వతీపురం మన్యం జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కాగాన విజయకుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎ.సూర్యనారాయణ, రాష్ట్ర సహాధ్యక్షులు పి.రాజశేఖర్, గోపిచంద్ లు, ఎస్సీ ఎస్టీ ఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు అన్ను వెంకటరావు, పి.ఆర్.టి.యు. ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు సేవలందించిన కోమటిపల్లి విజయకుమార్, ఉపాధ్యాయునిగా చేపట్టిన నిరంతర సాధన, గుణాత్మక బోధనలను ప్రసంగించి అభినందించారు. శాలువా, ఫలతాంబూలాలు, పుష్పగుచ్చం, జ్ఞాపిక, కానుకలతో వేదికనలంకరించిన పెద్దలంతా సన్మానించారు. సన్మాన గీతికను జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు ఆలపించి బహూకరించారు. తదుపరి విజయకుమార్ ను స్థానిక బి.సి.కోలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.మోహనరావు, ఉపాధ్యాయులు సి.హెచ్.సురేఖ, పి.సుగుణ, ఎం.రవికుమార్, డి.మల్లేశ్వరరావు, ఎన్.విజయ భాస్కరరావు, వీరఘట్టం బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.పి.నాగమణి, పిఆర్టీయు అధ్యక్షులు కె.టి.టి.వి.పోలినాయుడు,  యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.దుర్గాప్రసాద్, కె.గోవిందరావు, ఎపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.మురళి, ఆర్.ధనంజయనాయుడు, బూరి వెంకట అప్పలనాయుడు, బోశెట్టి రామారావు, ఎస్సీ ఎస్టీ ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సూర్యనారాయణ, ఎం.ప్రసాద్ లు విజయకుమార్ వీరఘట్టం మండలాన జోయింట్ ఏక్షన్ కమిటీ ని ఏర్పరచి, అన్ని సంఘాలను సమన్వయపరచి ఉపాధ్యాయుల సంక్షేమ దిశగా ఆ జె.ఎ.సి.కన్వీనర్ గా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి అహర్నిశలూ కృషి చేసారని అన్నారు. పి.ఆర్.టి.యు. ప్రతినిధులు బెవర రాజగోపాల్, అరసాడ రామ్ కుమార్, దూసి శ్రీబాబు, తూముల ధనుంజయ నాయుడు, పలువురు ప్రముఖులు సైల రవికుమార్, నాగవంశం ఆదిలక్ష్మి, దేవరపల్లి రాజేష్ కుమార్, సంధ్యారాణి, ఉషారాణి, వినోద్ కుమార్, షేక్ హిమామ్, జి.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం విజయకుమార్ ను హాజరైన వారంతా శాలువాలు, కానుకలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు