వేచిన వేకువ వచ్చిందా?
వెచ్చగ భూమిని తాకిందా?
కురిసిన మేఘం అలిసిందా?
వెలసిన వానకు తెలిసిందా?
కష్టపు కలతను తొలగించి
కమ్మిన చీకటి తరిమేసి
నెమ్మది బ్రతుకున నింపేసి
కమ్మగ మనసును ఓదార్చి...
ఆశగ చూసే కనులకు
దోసిలి నిండేలా వరమిచ్చి
అసహాయంగా వేచిన మదికి
అవసరంగా చేయూతనిచ్చి..
కొత్తగ తెచ్చిన వెలుగులతో
మెత్తగ పుడమిని హత్తుకుని
పుత్తడి కాంతుల ప్రసరించి
చిత్తడి నేలను సవరించి
భయపు గుప్పెట తప్పించి
సాయపు చేయి అందించి
అపాయం కాకుండా దాటించే
ఉదయం తెచ్చిన ధైర్యానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి