-వారసత్వం ;- యామిజాల జగదీశ్
వారసత్వాన్ని ఎల్లప్పుడూ 
డబ్బు లేదా ఆస్తులతో కొలవడం సరికాదు.

కొన్నిసార్లు, 
మనం పొందగలిగే అత్యంత విలువైన వారసత్వం
తండ్రికున్న 
మంచి పేరు.  

నలుగురి నుంచీ 
ఆయన గురించి గౌరవంగా ప్రశంసలతో మాట్లాడటం విన్నప్పుడు
ఆయన మనకు అందించిన నిజమైన సంపదేమిటో   మనకు తెలుస్తుంది. 

ఆయన దయ, చిత్తశుద్ధి, ఇతరులతో వ్యవహరించిన విధానం 
మన జీవితానికి ఓ పునాదిగా మారుతాయి.

మనం 
ఎక్కడికి వెళ్లినా, 
తండ్రి అత్యుత్తమమైన వ్యక్తిత్వాన్ని మనకు చెప్పినప్పుడు, 
ఆయన మనకు అందించిన 
గొప్ప బహుమతి
ఆయన మిగిల్చిన  మంచితనం.
దాంతో మనకు 
లభించే స్వాగతం,
గుర్తింపు గుర్తు చేస్తుంటాయి.


కామెంట్‌లు