శివానందలహరి;- కొప్పరపు తాయారు


 శ్లో!
సారూప్యం తవ పూజనే  శివ మహాదేవేతి సంకీర్తనే 
సామీప్యం శివభక్తి  దుర్యజనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం  చ చరచరాత్మక తను ధ్యానే భవానీ పతే 
సాయుజ్యం మమసిధ్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్ధోస్మ్యుహమ్ !

భావం: ఓ పార్వతీ పతీ ! నీకు పూజలు చేయుచున్నప్పుడు సారూప్య ముక్తి శివా ! మహాదేవ ‌! అను  నీ నామ సంకీర్తన చేయునప్పుడు సామీప్య ముక్తి, నీ భక్తులతో సంభాషణ చేయునప్పుడు  సాలోక్య ముక్తి, స్థావర జంగమాత్మక మైన  నీ రూపమును ధ్యానించినప్పుడు సాయుజ్య ముక్తియు, నాకు ఇక్కడనే లభించుచున్నవి. కావున నేను ధన్యుడనైతిని. 
                  ***


కామెంట్‌లు