జ్ఞానం ;-- ఓషో- అనుసృజన ; జయా
పుస్తకాల నుంచీ
ఇతరుల నుంచీ 
సేకరించే జ్ఞానం 
నీటి తొట్టిలో 
నిల్వ చేసే నీరులాంటిది...

నిల్వ చేసే కొద్దీ 
నీరెలా పాచి పట్టి
దేనికీ పనికి రాకుండా
పోతుందో ఆలానే
సేకరించామనుకున్న 
ఆ జ్ఞానం కూడా
ఎందుకూ 
పనికి రాకుండా పోతుంది

కానీ
నీ అంతట నువ్వు 
గ్రహించి 
తెలుసుకున్న జ్ఞానం 
స్థిరమైనది
ప్రయోజనకరమైనది
స్వచ్ఛమైనది


కామెంట్‌లు