సుప్రభాత కవిత ; -బృంద
మనసంతా నిండిన 
మౌనాన్ని పలకరిస్తూ....
మెత్తగా హత్తుకుని
నేనున్నానని ఓదారుస్తూ....

మున్నీట మునిగిన 
కన్నీటి జీవితాలను
మిన్నగా కాపాడుతానని
చల్లటి కబురేదో అందిస్తూ....

సర్వం పోయిన బ్రతుకులలో
పర్వంలా  ప్రవేశించి
వెలుగు చూపి తోడుగా
వెన్నంటి ఉంటానని మాటిస్తూ..

అనుకోని ఆపదలో తోడుగా
ఆదుకునే మనసులకు నీడగా
ఆర్తులకు అందే ఆహారంగా
అనుక్షణం రక్షించే దీక్ష తీసుకున్నట్టూ...

పోరాటాలకు బాసటగా
ఆరాటాలకు ఆధారంగా
ఆట అయిన బ్రతుకులో
కొత్త బాట చూపిస్తానంటూ...

కలకాలం కన్నీళ్ళుండవనీ
కలగన్న కాలం మళ్ళీ వచ్చేనని
కలవరం మాని కదలమనీ
నీరసపు నిస్తేజం వదలమనీ...

తూర్పు తలుపు తోసుకుని
తొలికిరణాలు ప్రవేశించి
నలిగిన మనసులకు ఉత్తేజంగా
మార్పును చూపే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు