@ ప్ర కృ తి ... కోపోద్రిక్తం ! ;- కోరాడ నరసింహ రావు
మితి మీరెను మనిషి సుఖం..! 
నింగి,నేల,నీరు,గాలి,కలుషితం...!! 
  జల్లెడలా...చిల్లులుపడు
తున్న ఆకాసం! 
 అపరిమితంగా... వేడెక్కి పోతున్న భూగోళం..!! 
 
 జల ప్రళయం... భూ కంపం... 
 మల మలా మాడి అతలా, కుతల మైపోతున్న  జీవ జాలం..! 

 ఇంత జరుగు తున్నా ... నిమ్మకు నీ రెత్తు తున్నట్టున్న.. 
మా న వ  నైజం...! 
 
ఆలోచించరా పరిష్కారం...! 
  ఆపరా అడవులు నరకటం... 
 ప్రారంభించరా విరివిగా మొక్కలు నాటటం..
 తగ్గించరా యంత్రాలవాడకం..
 
చావైనా ... బ్రతుకైనా.... 
 మన చేతుల్లోనే.. 
 మన చే త ల్లో నే...! 
  *******
  .. కోరాడ నరసింహా రావు!

కామెంట్‌లు