దీక్ష -కృషి ;- ముంజులూరి కృష్ణ కుమారి

 పొట్టి, గిడస, మరుగుజ్జు అంటూ వెక్కిరించే మిత్రులతో నవదీప్ "అలాగే అనండి, నా సత్తా చూపిస్తా ఏదో ఒక రోజు. అనేవాడు. నవదీప్ కి ఆటలంటే ఇష్టం. ఆసక్తి తో జావలిన్ త్రో లో పట్టు సాధించాడు. జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి లో ప్రతిభ చూపి పారిస్ లో పారాఒలింపిక్స్ లో పొట్టివాళ్ళ జావలిన్ త్రో విభాగం లో పాల్గొన్నాడు. నవదీప్ కి ఝాఝరియా అనే మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు. 'నవదీప్!అందరూ భుజబలం తో జావలిన్విసరాలనుకుంటారు. కానీ పిక్కబలం, కాలి బలం తో ఎగిరి విసిరితే విజయం సాధిస్తావు ' అని సూచన ఇచ్చాడు. నవదీప్కి ఆదే సహాయకారి అయింది.పోటీలో 47.32మీటర్లు దూరం విసిరాడు. ఇరాన్ కు  చెందిన సాయా 47.72 మీటర్లు దూరం విసిరాడు కానీ రాజకీయ జెండా ను ప్రదర్శించి నిబంధన అతిక్రమించాడు. దాంతో నవదీప్ కి బంగారుపతకం దక్కింది. భారత దేశ కీర్తి పెంచిన నవదీప్ పేరు మారుమోగింది పేపర్లు, టీవీలు నవదీప్ ని పొగుడుతుంటే ఇన్నాళ్లు వేళాకోళం చేసిన అతని మిత్రులు, ఇరుగుపొరుగు సిగ్గుపడి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమయారు. పిల్లలూ!దీక్ష, పట్టుదల ఉంటే ఎందులోనయినా రాణించి చూపగలరు. ఏ అంగవైకల్యం అడ్డుకోలేదు అందుకు నవదీప్ ఉదాహరణ ' అంటూ మాస్టార్ తరగతి లో పిల్లలకు వివరించారు.
కామెంట్‌లు