ఇంద్రియ నిగ్రహం అత్యావశ్యకం;-సి.హెచ్.ప్రతాప్

 శ్లో. పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానామసులభా
తథాహ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధమతులాం
తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః. (సౌందర్యలహరి. 95)

అమ్మవారి కృపకి మనం పాత్రులు కావడమంటే అది సాధారణమైన విషయం కాదు. దానికీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకు ప్రమాణం జగద్గురు శ్రీఆదిశంకరాచార్య రచించిన సౌందర్యలహరీ స్తోత్రంలో వివరించబడింది.మనకు ఇష్టంలేని ప్రస్థావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతః శత్రువు. హద్దు మీరుతుంది. చేయకూడని పని చేస్తుంది. మాట్లాడకూడని మాటలను మాట్లాడిస్తుంది. దీనివలన అనర్ధం జరుగుతుంది. అది తనకు మంచి చేయదు, ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకముగా నిగ్రహించాలి.విజయ సాధనకోసం మనిషి ఎంతో శ్రమిస్తాడు. కానీ అసలైన వాటిని అదుపు చేసుకోకుండా లక్ష్యంపై గురి కుదరదు. విజయాన్ని వారించలేము. అందుకే మనిషికి ఇంద్రియ నిగ్రహం అత్యంత కీలకం.ఇంద్రియ నిగ్రహము అంటే చూచిందల్లా నాది కావాలి అని అనుకోవడం, ఏది వింటే ఆ దోవన పోవడం, కంటికి బాగున్నదల్లా అడ్డు ఆపు లేకుండా తినెయ్యడం, స్పర్శసుఖం కోసం పాకులాడటం. వీటిని అదుపులో పెట్టుకోవడమే ఇంద్రియ నిగ్రహము.శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు.మానసిక నియంత్రణ అంటే ఏమిటో తెలుసా? మీరు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారనుకోండి. నొప్పిని అనుభవించవద్దని మీరు మీ మనస్సును కోరితే, అది మీకు విధేయతగా భావించదు (అంటే మీరు నొప్పిని అనుభవించలేరు). పులి మీతో ఎదురెదురుగా వచ్చి కేకలు వేసినా, మృగానికి భయపడవద్దని మీ మనస్సును కోరితే మీకు భయం ఉండదు. ఇప్పుడు కారణం లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. మనసు అదుపులో ఉంటే ఎంతటి దుఃఖం వచ్చినా నవ్వుతూనే ఉంటాం. మరియు రెచ్చగొట్టే సమాధి కింద అది కోపానికి గురికాదు మరియు ప్రశాంతంగా ఉంటుంది. 
కామెంట్‌లు