తరగతి గదిలో అల్లరిగా ఉండడంతో కన్నయ్య మాస్టర్ వెళ్లాడు. మాస్టర్.... మాస్టర్... చంద్రుడు బాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు అని విద్యార్థులు కన్నయ్య మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏరా! చంద్రుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా! అని మాస్టారు అన్నాడు. లేదు మాస్టర్ నాపై అందరూ చాడీలు చెబుతున్నారు అని చంద్రుడు సమాధానమిచ్చాడు. కానీ మాస్టర్ కు ఎందుకో చంద్రుడి మాటలు నమ్మబుద్ధి కాలేదు. తరగతి గదిని నిశ్శబ్దపరిచి, విద్యార్థులకు రాత పని ఇచ్చి, కన్నయ్య మాస్టర్ బయటకు వచ్చాడు.
మాస్టర్ అలా బయటకు వెళ్ళాడో లేదో! చంద్రుడు అందర్నీ చెడ్డ మాటలతో తూర్పారపట్టాడు. కిటికీ వద్ద నుంచి కన్నయ్య మాస్టర్ చంద్రుడిని గమనించాడు. మళ్లీ తరగతి గదిలోకి వెళ్ళాడు. కన్నయ్య మాస్టర్ ని చూసిన చంద్రుడు గజగజ వణక సాగాడు. కన్నయ్య మాస్టర్ చంద్రుడిని దగ్గరికి తీసుకుని వాడి చేతిలో చాక్లెట్ పెట్టాడు. విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. మీకు చాక్లెట్ కావాలా! అయితే మీరు చెడ్డ మాటలు మాట్లాడండి అని మాస్టర్ అన్నాడు. విద్యార్థులు మౌనంగా ఉన్నారు. ఆరోజంతా మాస్టర్ చంద్రుడుని గమనిస్తూనే, చంద్రుడు చెడ్డమాట పలకగానే మాస్టర్ వాడికి చాక్లెట్ ఇవ్వసాగాడు. ఒక్క రోజులోనే పాతికకుపైగా చాక్లెట్లు చంద్రుడి జేబులో చేరాయి.
ఇలా వారం రోజులుగా కన్నయ్య చంద్రుడి ప్రతిచెడ్డ మాటకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. రాను రాను చంద్రుడు చాక్లెట్లు తీసుకునే సంఖ్య తగ్గిపోయింది. చంద్రుడిలో చెడ్డ పదం పలికేముందు మాస్టర్ ఇచ్చే చాక్లెట్ గుర్తుకొచ్చి, ఆపదాలను మనసులోనే మాయం చేసుకున్నాడు. రానురాను చంద్రుడి నోటి నుంచి చెడ్డ మాటలు పూర్తిగా మాయమైనాయి. విద్యార్థులతో పాటు కన్నయ్య మాస్టర్ చంద్రుడిలో వచ్చిన మార్పుకు సంతోషించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి