పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మరో అరుదైన గౌరవం లభించింది.
శ్రీకాకుళం సాహితీ చైతన్య కిరణాలు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి అంతర్జాల కవి సమ్మేళనంలో పాల్గొన్న తిరుమలరావు, తన కవితను వినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో వాడుక భాషకు తొలి జాడ గురజాడ శీర్షికన తన కవితను వినిపించిన తిరుమలరావును ప్రశంసిస్తూ సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షులు భోగెల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలక దేవానంద్ లు తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని పంపారు.
గురజాడ జీవిత విశేషాలను, సామాజిక స్పృహ కలిగించే ఆయన శైలిని, సాహిత్య పోకడలను కొత్త పుంతలు తొక్కించిన సృజనాత్మకతను, మూఢ విశ్వాసాలపై పోరాడిన కృషిని, సాధించిన ఫలితాలను, త్యాగనిరతిని తిరుమలరావు తన కవిత ద్వారా చాటిచెప్పారు.
తిరుమలరావుకు గురజాడ ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి