రాజు విజ్ఞప్తి;- - యామిజాల
 ఓ జ్ఞానిని కలిసిన ఓ రాజు స్వామీ, నాకోసం దేవుడికి ప్రార్థించండి అని కోరాడు.
అప్పుడు ఆ జ్ఞాని దేవుడా, ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ మంచిగే ఉండేలా చూడు స్వామీ అని కోరుకున్నాడు.
జ్ఞాని తనకో, లేక తన సామ్రాజ్యానికో ప్రత్యేకించి దేవుడిని కోరకపోవడం రాజుని మానసికంగా నొప్పించింది.
అతని మాటలతో ఈ విషయం గ్రహించిన జ్ఞాని రాజా, పంటపొలంలో నీరు పారిస్తున్నప్పుడు మొక్కల వేర్లకే నీరు పెట్టడం జరుగుతుంది. కానీ అది ఎలా మొక్కలన్నింటికీ ఉపయోగపడుతుందో అలాగే నా ప్రాపర్థన కూడా. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలని నేను కోరుకున్నాను. అందులో నువ్వూ ఉన్నావు కదా....అటువంటప్పుడు నీ ఒక్కడి కోసం విడిగా కోరుకోవడం ఎందుకు అని అన్నాడు.
అప్పుడుగానీ జ్ఞాని ఎందుకలా కోరుకున్నారో రాజుకు బోధపడింది.

కామెంట్‌లు