\సమవీక్షణం;-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 జ్ఞాపకాలు మోయలేని భారమే
అయినప్పటికీ గుర్తులుగా ఉండిపోతాయి.
అనుభవాలు  అంతే లేని కథలుగా కొనసాగుతూనే ఉంటాయి.
ఆప్యాయతలు నీటి ఊటలుగా
ఊరుతాయి‌.
అనుబంధాలు పొదరిళ్ళ లాగా
దడిగట్టుకుంటాయి.
బాధ్యతలు బహురూపాలై
నిర్వహించబడుతూనే ఉంటాయి.
విలువలు గులాబీముళ్ళై
పరీక్షిస్తూనే ఉంటాయి.
ప్రేమలు పాశాలై శాశ్వతత్వాన్ని
పొందుతాయి.
బంధుత్వాలు అనంతమై
నిలిచిపోతాయి‌.
స్నేహాలు నిత్యనూతనమై
ప్రకాశిస్తాయి.
బంధాలు అనివార్యమై
అమృతతుల్యమౌతాయి.
కర్తవ్యాలు కరవాలాలై
ఇరువైపుల పదునెక్కి ఉంటాయి.
కోరికలు అక్షయంగా పెరుగుతూ పరుగెత్తిస్తూనే ఉంటాయి.
సంబంధాలు సమ్మోహనాలై
వారధులు నిర్మిస్తాయి.
ధర్మాలు ఆచరణీయాలై
హద్దులు విధిస్తూనే ఉంటాయి.
కామెంట్‌లు