ఊరేగుదామంటే
పల్లకీలేదు
మోయటానికి
బోయీలులేరు
ఆకాశానికెగురుదామంటే
రెక్కలూలేవు
ఎక్కివెళదామంటే
నిచ్చెనలూలేవు
అందలం ఎక్కుదామంటే
ఆసీనాలూలేవు
సభల్లోమాట్లాడదామంటే
ఆహ్వానించేవాళ్ళూలేరు
తోడుకురమ్మంటే
వచ్చేవాళ్ళూలేరు
అండగానిలబడమంటే
సహకరించేవాళ్ళూలేరు
ఆడుదామంటే
చూచేవాళ్ళూలేరు
పాడుదామంటే
వినేవాళ్ళూలేరు
చీకటినితరుముదామంటే
దీపాలులేవు
అఙ్ఞానాన్ని పారద్రోలదామంటే
తెలివైనవాళ్ళూలేరు
ముచ్చట్లుచెప్పమంటే
నోరుతెరిచేవారులేరు
చ్తప్పట్లుకొట్టమంటే
చేతులుకదిలించేవారూలేరు
తిందామంటే
పంచభక్ష్యాలుపెట్టేవాళ్ళూలేరు
త్రాగుదామంటే
అమృతాన్నందించేవాళ్ళూలేరు
కవితలుకూర్చుదామంటే
చదివేవాళ్ళూలేరు
కైతనుపాడుదామంటే
శ్రోతలూవినటానికీలేరు
మీరైనా
ముందుకొస్తారా
కోర్కెలా
తీరుస్తారా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి