🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు.

శ్లో! 
కరోని త్వత్పూజాం సపది సుఖదో మే భవవిభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి
 పునశ్చ. త్వాం ద్రష్టు దివి భువి వహన్ శంకర్ విభో !!

  భావం :ప్రభూ ! ఓ శంకరా ! నీకు పూజలు,చేసేదెను, నాకు ఆ పూజకు మోక్షము అనే ఫలము మాత్రమే ఇమ్ము. అట్లు కాక బ్రహ్మత్వము గానీ, విష్ణుత్వము గానీ,ఇచ్చెదవు. ఏమో, అప్పుడు నిన్ను చూచుటకు హంసగా పుట్టి ఆకాశమంతా తిరుగలేను. వరాహముగా పుట్టి భూమి అంతా వెదుకలేను. చివరకు నిన్ను చూడలేక ఆ బాధను ఎలా
భరించను.కావున శీఘ్రమే మోక్షమును ప్రసాదించుము. 
            ****

కామెంట్‌లు