గౌతమ మహర్షి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆయన ఆయన భార్య అహల్య మునివంశంలో ఆణిముత్యంలా భాసించారు.క్షామకాలంలో ఆదంపతులు దైవం నికొలుస్తూ  పంటలు పండించి స్వయంగా వండి అందర్నీ ఆదుకున్నారు.  ఆయన తపస్సు ఫలితంగా  గంగ గౌతమిగా శివుడు త్రయంబకేశ్వరుడుగా అవతరించిన ప్రాంతం. బ్రహ్మ గిరికొండకింద శివారాధనచేసి ఒకగుంటచేస్తే వరుణుడు నీరు నింపాడు.లోకేశ్వరోపాసనతో ఆదంపతులు జనాలకి భోజనం పెట్టే వారు.ఆవరుణ గుండంలోంచి శిష్యులు గౌతమునికి అభిషేకజలం తెచ్చేవారు.   ఆరోజు మునులభార్యలు స్నానాలు చేస్తుంటే శిష్యులు అహల్య కి ఆవిషయం చెప్పారు. ఆమె భర్త పూజకోసం గబగబా వెళ్లి కుండతో నీరు తెస్తుంటే ఆమునిపత్నులు ఈర్ష్య అసూయ ద్వేషం తో నానామాటలు అన్నారు. ఆమె మాట్లాడకుండా వచ్చేసింది. తాము వండివారుస్తుంటే మెక్కుతూ నానామాటలు అనే వారిని గౌతమ దంపతులు ఏమీ అనేవారు కాదు. ఈశ్వరేచ్ఛ అని ఊరుకున్నారు.
ఆమునిపత్నులు భర్తలకి చాడీలు చెప్పడం వారు గౌతమ మహర్షి పై గోహత్యపాపం నేరంమోపారు.పాపం ఆయన తను నిర్దోషి ఐనా  " నేను గోహత్యపాపం చేశాను " అని మధన పడుతూ శివునిగూర్చి తపస్సు చేశాడు.ఆయన ప్రత్యక్షమై" నీవు చేరదీసినవారు కృతఘ్నులు.నీమీదే నేరంఆరోపించిన దుర్మార్గులు " అని నానావిధాలుగా శివుడు నిందించాడు.గంగ గౌతముని శిరస్సు పై అభిషేకం చేసి అక్కడ గౌతమినదిగా ప్రవహిస్తూ సస్యశ్యామలంగా గోదావరి జిల్లాల ను చేసింది.శివలింగం వెలసింది ఆక్షేత్రంలో!
కొసమెరుపు..అప్పయ్య దీక్షితులు ఉన్మత్త పంచశతిరాశారు.గొప్ప శివ భక్తులు. ఒకసారి తనని తాను పరీక్షించుకోటంకోసం శిష్యులతో" ఆమందు నేను తాగుతాను.దాని తో నాకు పిచ్చి ఎక్కుతుంది. అప్పుడు నేను వాగేదంతా మీరు రాయండి. ఓ2గంటలతర్వాత పిచ్చి పోయే ఆమందుని నాకు ఇవ్వండి" అని ఆదేశించారు.ఆపిచ్చిలో కూడా ఆయన శివస్తుతి చేశారు. " శివా! అర్కం అంటే జిల్లేడుపూవు ద్రోణ అంటే తుమ్మిపూవుతో తృప్తి పడే బోళాశంకరా!"    అని స్తుతించారు🪷.
కామెంట్‌లు