సుప్రభాత కవిత ; -బృంద
కనులకు విందైన 
కోటి అందాలతో
కమ్మగ తోచే నెందుకో
అమ్మలా అవని!

అమృతాలు అందించి
ఆదరంగా రక్షించి
అనుపమాన ప్రేమ
అందరిపై సమానంగ చూపి...

ఆకలి వేళకు అన్నమిచ్చి
తీయని జలంలో ఆర్తి తీర్చి
కాలగతికి సరిపడు
కాయ ఫలాల నందించు

పుడమికి ఏమిచ్చి 
ఋణం తీర్చుకోగలం?
ఉన్నది ఉన్నట్టు ఉంచి
స్వార్థం కొంత ఆపుకుంటే చాలు!

ఇచ్చుటే తప్ప ఎప్పటికీ
తెచ్చుకోను తెలియని ప్రకృతి
స్వచ్ఛతను  కాపాడు
ఇచ్ఛ పెంచుకోగలగాలి!

కొండలు కూడా 
కొల్లగొట్టబోకుండా
కొంతమేర  స్వేఛ్ఛగా
కానగ మారే అవకాశమివ్వాలి!

కళ్ళు తెరవక పోతే
కడగండ్లు తప్పవని
కల్ల కాదు ఈ మాట నిజమని
ఎల్లరకూ చాటి చెప్పి

మంచి మార్పు రావాలని
మనుషుల దీవించు
మన్నించు మనసున్న
మంచి వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు