అనగా అనగా ఒక అమెరికా .. ఏం చెబుతున్నారు అంటారా. తొందర పడక చదవండి . . అక్కడికి మన దేశం నుంచి ఒక తెలుగు రచయిత్రి వెళ్లారు. ఆమె పేరు యలమర్తి అనూరాధ. అయితే సెప్టెంబర్ 14 న లాస్ ఏంజిల్స్ ,చినోహిల్స్ లో ; సాహితీ సదస్సును నిర్వహించారు తెల్సా అధ్యక్షులు శ్రీ మల్లిక్ కేశవరాజు గారింట్లో. కార్యక్రమానికి చాలా మంది తెలుగు అభిమానులు వచ్చారు. ఈ సందర్బంగా. ఆ సభలో
శ్రీమతి యలమర్తి అనూరాధ "దేశభక్తి" అనే కథ ను,"ముందస్తు దరఖాస్తు"అనే కవితను అక్కడ శ్రోతలకు వినిపించారు.ఇదిలా ఉండగా ఇదే వేదికపై యలమర్తి అనూరాధ మనవరాలు చిరంజీవి "అన్షీ నైరా" పిల్లలూ దేవుడు చల్లని వారే పాట పాడింది.దీంతో ఇంత చిన్న వయసులో చక్కని తెలుగులో పాట పాడిన ఈ చిన్నారిని అందరూ అభినందించారు . విదేశాల్లో పుట్టి చక్కని తెలుగులో పాట పాడిన చిన్నారిని మనం కూడా అభినందిద్దాం . చుట్టూ ఇంగ్లీష్ , ఇతర దేశాల భాషలు మాట్లాడుతూ ఆ భాషల్లోనే చదువుతూ తెలుగు నేర్చుకోవడం విశేషం కదూ. మరి విదేశాల్లో ఉంటూ తెలుగులో ప్రతిభ కనపరిచే చిన్నారుల వివరాలను మొలకకు పంపండి. సరేనా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి