ఆరోగ్యమే మహాభాగ్యము;-* కోరాడ
 అందరి కంటే భాగ్యావంతులు
   ఆరోగ్య వంతులే పిల్లలూ..! 
 
పాలు, గ్రుడ్లు,కాయలు, పండ్లు
 ఆకు కూరలు , కాయగూరలు
 మన ఆరోగ్యానికిమంచివివే!!

అధిక ధనార్జన మరిగినమనిషి
  పాలు, నీళ్లు , గ్రుడ్లు నూనెలు 
 పప్పులు,కూరలు, పండ్లతొ సై తం ప్రతిది కల్తీ చేస్తు న్నాడు...!

ఆరోగ్యం కోసం తినేవి అన్నీ.... 
 విషముతో సమానమై పోతూ
  రోగా లెన్నో తెస్తున్నాయి...! 

అందుకే పిల్లలూ....! 
  వీలైన వరకు మన పూర్వు లందరూ... 
 రసాయన ఎరువులు వేయ కుండ , సేంద్రియ ఎరువులు వాడే వారు...! 
   పురుగు మందులను వాడకుండా... 
  వేప కాషాయం వాడే వారు! 
  ధాన్యము, పప్పులతోపాటే
  ఆకు కూరలు, కూరగాయలు
  పండ్లనుసైతం, స్వయము గానేపండించే వారు!! 

స్వచ్చమైన పాలు కోసం... 
  గోమాతలను పెంచే వారు! 

ఏటి నీరైన , చెరువు నీరైన 
 నూతి నీరైనగానీ,చక్కగ తేట
 పరచే వారు...ఆరోగ్యంగాబ్రతి కేవారు...!! 

ఎడ్లనుకట్టినగానుగలతోస్వచ్చ మైన వేరుశనగ, నువ్వుల నూనెలు ఆడి, వాడే వారు...! 
  చెరకుతో చక్కని బెల్లం చేసు కునే వారు...! 

ఆ రోజులు మనకు రావాలి పిల్లలూ... 
 మరలా మనమంతా ఆరోగ్యం తోఆనందంగాబ్రతకాలిపిల్లలూ
       *******

కామెంట్‌లు