స్కిల్ డెవలప్ మెంట్ లో వెనుకబాటుతనం; - సి.హెచ్.ప్రతాప్
 దేశం యొక్క అభివృద్ధి విజయం అనేది దాని మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి పై ఆధారపడి వుంటుంది.ఏదైనా దేశం ఎంత బాగా మానవ వనరుల అభివృద్ధి మీద పెట్టుబడులు పెడుతుందో ఆ దేశం ఆర్ధిక సమృద్ధిని సాధించినట్లు అవుతుందని చెప్పవచ్చు.కేవలం దేశం లో మౌలిక వసతులు,సాంకేతిక పరిజ్ఞాఞాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యం గా ఆ దేశం లో యువతకు ఉన్నత స్థాయి విద్యా, నైపుణ్యాలను అందిస్తే ఆ మానవ వనరులను ఆర్ధిక పెట్టుబడిగా పెట్టి దేశాన్ని పురోభివృద్ధి వైపు నడిపించవచ్చునన్నది మేధావుల అభిప్రాయం.
నాణ్యమైన విద్య మరియు వనరులకు అసమాన ప్రాప్యత ఉంది. విద్యను పొందడంలో గ్రామీణ-పట్టణ మరియు స్త్రీ-పురుష విభజన ఉంది .శ్రామికశక్తిలో నైపుణ్యం ఖాళీలు ఉపాధి మరియు ఉత్పాదకతకు ఆటంకం కలిగిస్తాయి.నిరంతర నైపుణ్య అభివృద్ధి సంస్కృతి లేకపోవడం డైనమిక్ పని వాతావరణంలో నైపుణ్యాల పునరుక్తికి దారితీస్తుంది.చారిత్రాత్మకంగా, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు నైపుణ్యాభివృద్ధిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు సరిపోలేదు. ఇది మానవ మూలధన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఉదాహరణకు మన ప్రభుత్వాలు దెస జి డి పి లో 0.7% మాత్రమే మాన్వ వనరుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాయి.
 
మన దేశ జనాభాలో అత్యధిక శాతం యువత కాగా వారి శక్తి యుక్తులు పూర్తిగా సద్వినియోగం అవడం లేదు. చాలా మంది యువత రకరకాల నైపుణ్య కోర్సులు నేర్చుకుంటున్నప్పటికీ వ్యక్తిగత కౌసల్యం  లేక వెనుకబడిపోతున్నారు.ప్రభుత్వం కౌశల్ భారత్ పధకాన్ని ప్రవెశపెట్టి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ఆశయం మంచిదే కాని అది కాగితాఅకే పరిమితమవడం  తో యువత కు సరైన లద్భి చేకూరడం లేదు. ఇందుకు కారణం పాఠశాల స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలు అడుగుపెట్టడం తో విద్యార్ధులను యంత్రాలుగా మార్చేసాయి.వారిలో వున్న ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికి తీయడం లో పూర్తిగా విఫలమౌతున్నాయి.ఈ సంస్థలు విద్యార్ధులను మూసలో పోసినట్లు సాంప్రదాయ విద్యా బోధనకు , శిక్షణకు అంటిపెట్టుకు వుండేటట్లు చేసి ఇంజనీరింగ్, వైద్య విద్య , అక్కౌంట్స్ , ఎం బి ఏ లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కానీ కొత్తగా వస్తున్న నైపుణ్య కోర్సుల వైపు మళ్ళించడం లో విఫలమయ్యాయి. తల్లిదండ్రులు కూడా వారి ఆశయాలను పిల్లల నెత్తి మీద బలవంతం గా రుద్ది వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం లో పూర్తిగా విఫలమౌతున్నారు. దానితో వారిలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేక రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోతున్నారు..అత్యంత విదెశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే మన దేశం లో  లో హస్త కళా రంగం లో యువతను పదును పెడితే ప్రయత్న లోపం తో వాటి ఎగుమతులు కూడా పెంచవచ్చు. యువతను వారి అభిరుచిని బట్టి ఎంచుకున్న రంగం వైపు మళ్ళేందుకు కావల్సిన శిక్షణ ,ప్రాత్సాహం, ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు తమ ప్రతిభ మరింత మెరుగ్గా కనబరచే అవకాశాలు వుంటాయి. 

కామెంట్‌లు