క్షణం;- - యామిజాల జగదీశ్
క్షణం
ఎందుకు విలువైనదంటే...

ఈ తరుణంలో..
ఎవరో ఒకరు 
అందమైన బిడ్డకు 
జన్మనివ్వొచ్చు

ఎవరో ఒకరు 
ప్రేమను పంచొచ్చు 
ప్రేమను పొందొచ్చు

ఎవరో ఒకరు 
ప్రశాంతంగా 
నిద్రపోతుండొచ్చు

ఎవరో ఒకరు
కొత్త జీవితానికి
శ్రీకారం చుట్టొచ్చు

ఎవరో ఒకరు
చదవటం 
నేర్చుకోవచ్చు

ఒక చిన్నోడు 
మొదటిసారిగా
మాట్లాడొచ్చు  

ఒక చిన్నోడు
మొదటిసారిగా
ఓ అడుగు వేయొచ్చు

ఎవరో ఒకరు 
అంతరిక్షంలోకి చూడొచ్చు

ఎవరో ఒకరు
ఓ వ్యాధికి మందు 
కనుక్కోవచ్చు

ఎవరో ఒకరు
తన జీవితాన్ని మార్చే 
డబ్బును గడించొచ్చు

ఎవరో ఒకరు 
తమ జీవితంలో 
ఉత్తమమైన రోజును 
పొందొచ్చు

అయితే అదే సమయంలో
ఎవరో ఒకరు 
జీవించడానికి 
కొన్ని రోజులు మాత్రమే 
ఉన్నాయని తెలుసుకోవచ్చు

ఎవరో ఒకరు
ఈ భూమ్మీద నుంచి
శాశ్వత వీడ్కోలు
పొందవచ్చు 

ఎవరో ఒకరు 
ఆహారం లేదా ఆశ్రయం కోసం
కోరవచ్చు

ఎవరో ఒకరు 
తమ జీవితంలో 
అత్యంత ఆత్మీయుడిని 
కోల్పోవచ్చు

అందుకే
క్షణం అనేది ఒక నిధి
అమూల్యమైనది
ఏదీ శాశ్వతం కాదనే
నిజం తెలుసుకుని
ఏ క్షణానికా క్షణం
దేన్నయినా
స్వీకరించాలి
అంతేతప్ప
డీలా పడటం అనవసరం


కామెంట్‌లు