న్యాయాలు-614
బహురాజ పుర న్యాయము
**""***
బహు అనగా అధికము,సమృద్ధము, అనేకము,తఱచు, పెద్ద, అధికముగా, పెద్దగా. రాజ అనగా రాజు.పుర అనగా నగరం,కోట, ఇల్లు, శరీరము, అంతఃపురము అనే అర్థాలు ఉన్నాయి.
పలువురు రాజులు పాలకులుగా ఉన్న పట్టణము వలె. అలా ఎక్కువ మంది నాయకత్వంలో వారిలో వారికి మాట కలవకపోవడం వల్ల పట్టణ అభివృద్ధికి బదులు ధ్వంసానికే దారి తీస్తుంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సమానార్థకంగా "పది మందిలో పాము చావదు" ఈ సామెతను ఉపయోగించవచ్చు. ఎందుకంటే హడావుడి ఎక్కువ ఉంటుంది. చేసేది మాత్రం తక్కువ ఉంటుంది. దాన్ని చంపడం మాట అటుంచి అదిగో ఇదిగో అనడమే ఉంటుంది.
ఇక పెత్తనం విషయానికి వస్తే కుటుంబమైనా,సంస్థ లేదా ఏదైన ఉద్యమం అయినా అంతే .దాన్ని నిర్వహించడానికి ఒక్కరు మాత్రమే ఉంటే ఏ సమస్యా ఉండదు.మంచైనా చెడైనా ఒకరి మీద నుండే పోతుంది. మంచివాడైతే పది కాలాల పాటు నాయకుడుగా ఉంటాడు.లేదంటే మనమే అతన్ని సరిచేయడమో జాగ్రత్తలో మనం ఉండటమో చేస్తాం.
ఇక వంటల విషయానికి వస్తే కూడా ఇదే వర్తిస్తుంది.ఇంటిలో ఏదైనా ,ఏవైనా వంటలు చేసుకోవాలి అనుకున్నప్పుడు.నలుగురు నాలుగు రకాల కూరలను చేయమని కోరితే ఎవరు చెప్పింది వినాలో తెలియక అసలు విషయం మరుగున పడుతుంది. ఏది చేయాలో, ఏం చేయాలో తెలియక అసలు వండక పోవడం కూడా జరుగుతుంది.
" అలాగే మనం ఎన్నుకున్న నాయకులు కూడా అంతే.ఇద్దరు ముగ్గురు ఒకే ప్రదేశంలో ఉన్నట్లయితే ఏదైనా అభివృద్ధికి సంబంధించిన పనిని కానీ , సహాయక కార్యక్రమాలు కానీ, ప్రజా సమస్యలు కానీ మిగతా వారు చేస్తారులే, వారే చూసుకుంటారులే అనే ధీమాతో ఎవరికి వారు పట్టించుకోకుండా వుంటుంటారు.అలా చివరికి ఎవరూ చేయరు. చేయాల్సిన పని కాస్తా ఆదిలోనే "హంస పాదు" అయి పోతుంది.అందుకే "పది మందిలో పాము చావదు" అంటారు.
"బహుదా రాజ పుర న్యాయము"లో దాగి ఉన్న రహస్యం ఇదే. సమాన సమాన బలం, శక్తి అధికంగా ఉన్న వారు ఇతరుల పెత్తనాన్ని, చేసే పనులను సహించరు. అందువల్ల ఆ పనికి వ్యతిరేకంగా చేయడంతో చేసిన పని వల్ల లాభం కంటే నష్టమే కలుగుతుంది.కాబట్టి అలాంటి వారికి పని విభజన చేయడమో , ప్రాంతం విభజన చేయడమో జరగాలి. లేదంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందనీ, అలా ఉండకూడదు అని చెప్పడానికే ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మానవ మనస్తత్వాన్ని ఔపోసన పట్టి చెప్పిన విషయాలు అవి. కాబట్టి ఆదిలోనే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.అలాంటి పరిస్థితులను వెంటనే సరి చేయాలి.మిగతా అందరికీ సర్థి చెప్పగలగాలి. అలాంటప్పుడే మన తెలివి తేటలను సమయస్ఫూర్తిని ఉపయోగించి ప్రాణ, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి