జిల్లా జైలుకు టి.వి.ల బహూకరణ

 విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ గత 22 సంవత్సరాలుగా సొంత ఖర్చులతో లక్షలాది రూపాయలను వెచ్చిస్తూ స్వచ్చంద సేవలను గైకొనుట మిక్కిలి అభినందనీయమని శ్రీకాకుళం జిల్లా జైలు సూపరింటెండెంట్ సన్యాసిరావు అన్నారు. ఆమె తన తండ్రి కీ.శే. డా.కుప్పిలి త్రినాథరావు స్మృత్యార్ధం వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, మొక్కల పంపిణీ, పేదలకు ఆర్ధిక సౌలభ్యాల కల్పన, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేలా వివిధరకాల వస్తు సామాగ్రిని ఉచితంగా అందజేడం వంటి విశేషమైన సేవలు చేస్తున్నారు. కీర్తి పట్నాయక్ ఇలా రాష్ట్రంలోనూ, దేశంలోను అనేక ప్రాంతాల్లో సేవలనందిస్తూ నేడు 
శ్రీకాకుళం అంపోలు రోడ్ లో గల జిల్లా జైలులో గల ఖైదీల సౌకర్యార్ధం రెండు ప్లాట్ టి.వి.లను  జైలు సూపరెంటెండంట్  సన్యాసిరావు చేతులమీదుగా బహూకరించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి పట్నాయక్ మాట్లాడుతూ క్షణికావేశం, వివిధ రకాల తప్పిదాలనబడే కారణాలవల్ల  జైలులో శిక్ష అనుభవిస్తున్న వారికి  మానసిక ప్రశాంతత చేకూర్చేలా ఈ ప్లాట్ టి.వి.లు ఉపయోగపడునని అన్నారు. ఆధ్యాత్మిక పరమైన భక్తి చానెల్స్, వర్తమాన ప్రపంచ సమాచారాన్ని తెలిపే న్యూస్ చానల్స్ చూడటం ద్వారా మనో వికాసంతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరిండెంట్ సన్యాసిరావు, జైలర్ ఉదయ్ భాస్కర్, డిప్యూటీ జైలర్ రామకృష్ణ, లక్ష్మణరావు శ్రీకాకుళం ఇస్కాన్ టెంపుల్ కమిటీ సభ్యులు ఉరిటి సత్యనారాయణ, హౌసింగ్ బోర్డ్ విశ్రాంత ఎ.ఈ. గౌరీశంకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జయంతి కానుకగా వారంరోజుల ముందుగా వీటిని అందజేస్తున్నామని కీర్తి పట్నాయక్ తెలిపారు. అనంతరం ఖైదీ లందరికీ మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు