తాత్కాలికమే అన్నీ
అనివార్యం కొన్ని.
సహేతుకం కొన్ని
గర్హనీయం మరికొన్ని.
సమంజసం కొన్ని
సమయోచితం మరికొన్ని.
ప్రాప్తం కొన్ని
దురదృష్టం మరికొన్ని.
అదృష్టం కొన్ని
అవసరం మరికొన్ని.
కాకతాళీయం కొన్ని
స్వయంకృతం మరికొన్ని.
అసంకల్పితం కొన్ని
దైవానుగ్రహం మరికొన్ని.
కర్తవ్యం కొన్ని
బాధ్యత మరికొన్ని.
ధర్మం కొన్ని
న్యాయం మరికొన్ని.
సంఘటితం కొన్ని
స్వార్థం మరికొన్ని.
వారసత్వం కొన్ని
అలవాటు మరికొన్ని.
అవకాశం కొన్ని
అలసత్వం మరికొన్ని.
నిర్లక్ష్యం కొన్ని
నిర్బంధం మరికొన్ని.
నిర్వేదం కొన్ని
నిగూఢం మరికొన్ని.
ఇంగితం కొన్ని
అవగతం మరికొన్ని.
జ్ఞానం కొన్ని
అజ్ఞానం మరికొన్ని.
విచక్షణ కొన్ని
విలక్షణం మరికొన్ని.
అభ్యుదయం కొన్ని
ఆచరణీయం మరికొన్ని.
చైతన్యం కొన్ని
చింతన మరికొన్ని.
ఆలోచన కొన్ని
అవలోకన మరికొన్ని.
సంక్లిష్టం కొన్ని
సందర్భం మరికొన్ని.
చరిత్ర కొన్ని
చమత్కారం మరికొన్ని.
సందేశం కొన్ని
సరళం మరికొన్ని.
బంధం కొన్ని
బలవంతం మరికొన్ని.
నియమం కొన్ని
నిజం మరికొన్ని.
సమయం కొన్ని
సామరస్యం మరికొన్ని.
బలం కొన్ని
బలహీనత మరికొన్ని.
పాత్రత కొన్ని
పాపం మరికొన్ని.
ఉత్తమం కొన్ని
ఉట్టివే మరికొన్ని.
సాహసం కొన్ని
సహకారం మరికొన్ని.
ఉత్సాహం కొన్ని
ఉదాసీనత మరికొన్ని.
భయం కొన్ని
భారం మరికొన్ని.
గమ్యం కొన్ని
ఘనం మరికొన్ని.
జటిలం కొన్ని
ఝంజాటం మరికొన్ని.
అంకితం కొన్ని
అవలక్షణం మరికొన్ని.
తార్కికం కొన్ని
తలనొప్పి మరికొన్ని.
వ్యాపారం కొన్ని
వ్యవహరం మరికొన్ని.
లౌక్యం కొన్ని
మంచి మరికొన్ని.
వంచన కొన్ని
వాదన మరికొన్ని.
తీర్పు కొన్ని
తీర్మానాలు మరికొన్ని.
సందేహం కొన్ని
సూత్రం మరికొన్ని.
సిద్ధాంతం కొన్ని
రాద్ధాంతం మరికొన్ని.
అరాచకం కొన్ని
ఆప్యాయత మరికొన్ని.
దాపరికం కొన్ని
బహిర్గతం మరికొన్ని.
హద్దు కొన్ని
పద్దు మరికొన్ని.
సూక్ష్మం కొన్ని
సుత్తి మరికొన్ని.
భక్తి కొన్ని
నీతి మరికొన్ని.
సంపాదన కొన్ని
నింపాది మరికొన్ని.
క్షణం కొన్ని
క్షవరం మరికొన్ని.
ఋజువు కొన్ని
నిశ్చయం మరికొన్ని.
పాఠం కొన్ని
ప్రారబ్దం మరికొన్ని.
నిత్యం కొన్ని
సత్యం కొన్ని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి