@అదృష్ఠవంతులు మీరే...! ;- కోరాడ నరసింహా రావు.
 నిజంగా...మీరు  అదృష్ఠవంతులే...! మీకు... 
 సర్వమూ కోల్పోయి రోడ్డున పడిపోయే... భూకంపాలూ లేవు, జల ప్రళయాలూ రావు!

 రౌడీ ల హల్ చల్ లూ లేవు.... 
 కేడి ల చోరీ లూ  లేవు...! 
 
మీరు  నిజంగానేఅదృష్ఠవంతు లు..., మీలో  ఎట్టి ఈర్ష్యా సూయలులేవు..., 
     ప్రేమాభిమానాలు తప్ప..!

అదృష్ఠ వంతులంటే మీరే..! 
  కల్తీలేని ఆహార పదార్ధాలన్నీ
మీరే పండించుకు తింటున్నారు..! 

 స్వచ్చమైన గాలిని,నిర్మలమైన  నీటిని అనుభ విస్తున్నారంటే , 
 మీ కన్నా అదృష్ఠవంతు లింకె వరు...!? 

యెట్టి వై ర స్ లకు అందనంత దూరంలో  హాయిగా బ్రతుక గలుగుతున్నారంటే  ఇంత కంటే అదృష్ఠమింకేముంది?! 

హత్యలు , మాన భంగాలు తెలియని అదృష్ఠము అందరి కీ ఉండదు కదా...! 

ఇవి చాలవా  జీవితంప్రశా0తం  గా...సాగిపోయిందని సంతో షించి , ఆనందించటానికి... 
  ఇవి చాలు....! 
        *******

కామెంట్‌లు