పురాతన ఖగోళ గడియారం;-- యామిజాల జగదీశ్
 ఇక్కడ మీరు చూస్తున్న ఖగోళ గడియారం 1410 నాటిది. ఇది ప్రాగ్ లో ఉంది. ఇది నిజమైన మధ్యయుగ ఇంజనీరింగ్ అద్భుతం. ఈ నాటికీ పని చేస్తున్న పురాతన ఖగోళ గడియారం.  ప్రేగ్ లోని ఓల్డ్ టౌన్ స్క్వేర్‌లో ఈ గడియారం ఉంది. ఈ గడియారం కేవలం టైముని మాత్రమే కాకుండా  తేదీ, రాశిచక్ర గుర్తులు, ముఖ్యమైన ఖగోళ సమాచారాన్ని కూడా చూపుతుంది. గడియారం సంక్లిష్ట రూపకల్పన, దోషరహిత మెకానిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని సృష్టికర్తల ప్రతిభకు అధునాతన సాంకేతికత అద్దం పడుతోంది. ఇది ప్రాగ్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా భావిస్తున్నారు. 
చెక్ గణతంత్రం చెహియా అని కూడా అంటారు. ఇది మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఈశాన్య సరిహద్దులో పోలండ్, పశ్చిమ సరిహద్దులో జర్మనీ, దక్షిణ సరిహద్దులో ఆస్ట్రియా, తూర్పు సరిహద్దులో స్లొవేకియా దేశాలు  ఉన్నాయి. దీని రాజధాని ఓ పెద్దనగరం. దీని పేరు ప్రాగ్. దేశవైశాల్యం 78,866 చదరపు కిలోమీటర్లు. దేశంలో ఖండాంతర వాతావరణం నెలకొని ఉంటుంది. దేశం మొత్తం జనాభా 10.6 మిలియన్లని అంచనా. ఇక రాజధాని ప్రాగ్ నగరం జనాభా సుమారు 12 లక్షలు.


కామెంట్‌లు