పని సర్దుబాటు ప్రక్రియ కదలిక -;-పాతపొన్నుటూరులో తిరుమలరావు చేరిక

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు స్థానచలనం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వర్క్ ఎడ్జిస్ట్మెంట్స్ ప్రక్రియలో ఆయన పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ ఐనారు. అవసరానికి మించి ఏయే పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో, వారిని అవసరమయ్యే పాఠశాలలకు తాత్కాలికంగా బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా, కొత్తూరు మండలంలో వివిధ పాఠశాలలనుండి 12మంది ఉపాధ్యాయులు, అదే మండల పరిధిలో అవసరమనుకున్న పాఠశాలలకు పని సర్దుబాటు అయినారు. కొత్తూరు మండలం కడుము హైస్కూల్ నుండి కుదమ తిరుమలరావును ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు రిలీవ్ చేయగా, నేడు పాతపొన్నుటూరు ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు జోయిన్ చేసుకోవడం జరిగింది.  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంచాలకుల ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.తిరుమలచైతన్య నిర్దేశాలమేరకు కొత్తూరు మండల కేంద్రంలో ఈనెల 19వతేదీన జరిగిన కౌన్సెలింగ్ లో పన్నెండు మందికి స్థాన చలనం కలిగింది. 
ఈ పనిసర్దుబాటు బదిలీల అమలును కొత్తూరు మండల విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావుల నిర్దేశాలతో కుదమ తిరుమలరావు తదితరులు వారి వారి కొత్త పాఠశాలలకు వెళ్లి నియమితులైనారు. 
పాత పొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, సహోపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, ఇశాయి సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావులు తిరుమలరావును ఆత్మీయంగా స్వాగతం పలికారు.
కామెంట్‌లు