అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన అమరచింత మండల ఎస్సై బి.సురేష్
 అన్నదాత మహంకాళి శ్రీనివాస్ ను అభినందించిన ఎస్సై బి.సురేష్
యువతకు డ్రగ్స్ పై అవగాహన కలిగించినందుకు అమరచింత ఎస్సై బి.సురేష్ గారిని ఆత్మీయంగా సన్మానించుకున్న వినాయక మండప నిర్వాహకులు, యువకులు
     వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో శివపార్వతి గణేష్ నగర్ వద్ద గణేష్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.గురువారం పట్టణంలోని బీసీ కాలనీలోని శివపార్వతి గణేష్ వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమాన్ని  ముఖ్య అతిథులుగా అమరచింత మండలం ఎస్సై బి.సురేష్ ప్రారంభించి భక్తులకు అన్నం వడ్డించి,కాలనీలో ఉన్న యువతకు వినాయకుడి నిమజ్జన సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు,మందు,మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని వారు తెలియజేశారు.
    అన్నదానము మహాదానం.అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నదానానికి అన్నదాతగా ముందుకు వచ్చిన చేనేత వ్యాపారస్తులు,సిని నిర్మాత మహంకాళి శ్రీనివాసులు గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు,యువకులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వినాయకుడు మండప నిర్వాహకులు,యువకులు ఎస్సై బి.సురేష్ గారిని ఆత్మీయంగా సన్మానించుకుని ధన్యవాదాలు తెలియజేశారు
       ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వినాయకుడి మండపం దగ్గర అన్నదానం చేయాలనే కోరికను చెప్పిన వెంటనే అన్నదాతగా ముందుకు వచ్చిన ప్రముఖ సినీ నిర్మాత,జరీ చీరల వ్యాపారి, సామజిక సేవకులు మహంకాళి శ్రీనివాసులు అన్నదానం ఏర్పాటు చేశారు వారికి,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన అమరచింత మండలం ఎస్సై బి.సురేష్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని నిర్వహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శివపార్వతి గణేష్ నగర్ నిర్వాహకులు, బీమ, సురేష్ మరియు కాలనీ యువకులు, పెద్దలు తదితరులుపాల్గొన్నారు.

కామెంట్‌లు