పర్యావరణం ; కోరాడ
 పల్లవి :-
సకల సృష్ఠిలో...విశిష్ఠమైనది , మన భూగోళ మేను పిల్లలూ ! 
 ఈ భూమి కంటె అనువైన గ్రహము వేరేదీ లేదు పిల్లలూ !! 
అను పల్లవి :-
  స్వచ్చ మైన గాలి, సుద్దమైన నీరు... క్రమము తప్పని పగలు - రాత్రి... ఆహ్లాద కరమైన వాతా వరణము...అన్నీ అమరిన భూగోళం... మన ప్రాణి కోటికే సొంతం...! మన ప్రాణి కోటికే సొంతం..!! 
          "సకల సృష్ఠిలో.... "
చరణం :-
     అతిగా... సుఖముల నా సించి ,మన పూర్వులు చేసిన తప్పులకు ...నింగి, నేల, నీరు, గాలి...కలుషిత మైపోయాయి! 
 అతి ప్రమాద కరమైన సూర్య కిరణాల నుండి మనలను ర క్షించే, రక్షణకవచం " ఓ జో ను పొర" ...చిల్లులు పడిపో యింది...!"
చిల్లులు పడి పోయింది...!! 
  రోజు- రోజు కూ అగ్ని గుండ ముగ మారుతున్నది భూగోళం
  జల ప్రళయాలు, భూ కంపా లతో  కకావికలము ప్రజా నీకం
         " సకల సృ ష్ఠిలో.... "
చరణం :-
 భావి తరాల భాగ్య విధాతలు మీరే నండి పిల్లలు... మీరే మీరే
పిల్లలూ...! 
  అడవులు నరకుట మానాలి మీరు మొక్కలు విరి విగ నాటా లి...! 
   మోటా రులు - యంత్ర పరికరముల వాడుక బాగా తగ్గించాలి... ! 
   కాలుష్యం నివారించాలి , పర్యా వరణం రక్షించాలి... 
 ఆరోగ్యకర నిండుజీవితం మీరే
వారికి అందించాలి.... 3
       ******

కామెంట్‌లు