మూడు ముళ్ల తో... అగ్ని సాక్షి గా...ఏడడుగులు వేయించి , ఇరువురు స్త్రీ, పురుషుల నొకటి చేసే భారతీయ వివాహ బంధం... అత్యంత విశిష్టం..!ఇది కేవలం ఇద్దరు మనుషుల్ని కలపటంమాత్రమే కాదు... రెండు మనసుల్ని ఒక్కటిగా చెయ్యటం..!రెండు కుటుంబాల మధ్య ప్రేమలు పంచటం..!!ఒకరి పట్ల ఒకరికి ప్రేమాను రాగాల పిల్లలతో, మమతాను బందాల కుటుంబంగా విస్తరించటం....!అందరూ ఒకరి కొకరు బరోసా గా బ్రతకటం...!!వివాహ మంటే....,భార్య, భర్త ఒకరి కొకరు కడ దాకా తోడు, నీడగ జీవిస్తూ...బ్రతుకుల్ని పండించు కోవటంఅందమైన కుటుంబానికి శ్రీ కారమే వివాహము...!కష్ట మైనా, సుఖమైనా ...కడ దాకా కలిపి వుంచే....మన వివాహబంధ పవిత్రతను పరిరక్షించుకుందాము... మన భారతీయ వివాహ బంధ ఔన్నత్యమును ఎలుగెత్తి సగర్వముగా చాటుదము...!******
* వివాహం......! *;- .... కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి