శివానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో: యోగక్షేమ దురందరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్ట మతోపదేశ కృతినో  బాహ్యంతర  వ్యాపినః 
సర్వజ్ఞస్వ దయాకరస్య భవతః  కిం వేదితవ్యం మయః 
శంభోత్వం పరమాంతరంగ  ఇతి మే చిత్తే 
స్మరామ్యన్వహమ్ !!

భావం: శివా ! ఆశితులైన వారి యోగక్షేమ భారము ను వహించుట, వారికి సమస్త శ్రేయస్సులను అనుగ్రహించు వాడవును, వరములకు సమ్మతములైన బోధనలు చేయువాడు, ఎక్కడ చూచినా నీవే నిండియుండుట, దయతో చూచుట అనునవి అన్నియు నీ గుణములే కదా! నీ గురించి నేను ఇంకా ఏమి తెలుసుకుందును. నీవే నాకు మిక్కిలి ఆత్మీయుడవు అని ప్రతి దినము హృదయమున స్మరింతును. 
                      ****

కామెంట్‌లు